NLR : చిట్టమూరు మండలం ఎల్లసిరి గ్రామంలోని నాయుడుపేట నుంచి మల్లాం వెళ్లే రహదారిలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లాం నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న వ్యక్తి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి క్షత్రగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.