తిరుపతి: సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో సమీపంలో శనివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో దొరవరిసత్రం మండలంకు చెందిన మునిరాజ మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. భారతి కంపెనీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు.