తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.
ఇంకా 8 నెలలే ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ (YS Jagan) ఉంటాడని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) జోష్యం చెప్పాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ 160 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులు సైకో పాలన (Psycho) పోవాలని భావిస్తున్నారని తెలిపారు. విశాఖపట్టణంలో (Visakhapatnam) బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అచ్చెనాయుడు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని.. ఒక సైకో ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల దురదృష్టం. 2014 ఎన్నికల్లో జగన్ ప్రజలకు ఆశలు కల్పించి మోసం (Fraud) చేశాడు. ఇక జగన్ అధికారంలో ఉండేది 8 నెలలు మాత్రమే. వైసీపీలా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు. ఏపీని గాడీన పెట్టగలిగే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు. ‘బటన్ నొక్కడానికే ఉన్నాను.. మీరు కష్టపడండి అని సిగ్గులేకుండా ఎమ్మెల్యేలకు చెబుతున్నాడు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని.. కేవలం బటన్ నొక్కడం గొప్పతనం కాదు’ అని తెలిపాడు.
జగన్ పిల్లికంటే హీనంగా మారాడని తెలిపాడు. బెదిరించిన స్థాయి నుంచి ఎమ్మెల్యేలను బతిమాలకోవడం వరకు రావడం ఇది తమకు మొదటి విజయంగా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘పులివెందులలో కూడా తెలుగుదేశం జెండా ఎగురవేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాపై మరింత బాధ్యతను పెంచాయి. గతంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు. వెనుకబాటుతనం దూరం చేయాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు.