గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ తనయుడు అసద్, అతని అనుచరుడు గులామ్.. ఇద్దరు ఉత్తర ప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు (Gangster-politician Atiq Ahmed’s son Asad killed). ఈ ఎన్ కౌంటర్ పైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (up cm yogi adityanath), ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (up deputy cm Keshav Prasad Maurya), మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్ (former cm akhilesh yadav), మాయావతి (former cm mayawati), మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (mim chief asaduddin owaisi) తదితరులు స్పందించారు. యూపీ ఎస్టీఎఫ్ పోలీసులను సీఎం యోగి ప్రశంసించారు. అసద్ మృతి అనంతరం యోగి వెంటనే డీజీపీ, స్పెషల్ డీజీ లా అండ్ ఆర్డర్ తదితరులతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 24వ తేదీన ఉమేష్ పాల్ పైకి అసద్ కాల్పులు జరుపుతున్నట్లుగా సీసీ ఫుటేజీలో కనిపించింది. అసద్, గులాంలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి పైన ఒక్కొక్కరి మీద రూ.5 లక్షల రివార్డ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు వారిని గుర్తించిన పోలీసులు.. సరెండర్ కావాలని ఆదేశించారు. కానీ వారు తమ చేతిలో ఉన్న తుపాకులతో పోలీసుల పైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. అసద్ ఎన్ కౌంటర్ క్రిమినల్స్ కు హెచ్చరిక అని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ అన్నారు. యూపీ ఎస్టీఎఫ్ టీమ్ కు కంగ్రాట్స్ అని, నిందితులు మొదట పోలీసుల పైకి కాల్పులు జరిపారని, తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఫైరింగ్ చేయవలసి వచ్చిందని చెప్పారు.
క్రిమినల్స్ పైన ఇలాంటి ఎన్ కౌంటర్ల ద్వారా అసలు సమస్యలను దృష్టి మరల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని అఖిలేష్ ఆరోపించారు. దోషులను వదలవద్దని చెబుతూనే.. అది తప్పో ఒప్పో చెప్పే విషయం కోర్టులకు వదిలేయాలన్నారు. అతీక్ అహ్మద్ తనయుడు, మరో నిందితుడి హత్య పైన ఈ రోజు చర్చ సాగుతోందని మాయావతి అన్నారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. బీజేపీ ఎన్ కౌంటర్లు చేస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు ఎందుకని ప్రశ్నించారు.