కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉద్యోగులు తమ జీతం పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచేందుకు(DA Hike For Employees) ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జూలై 1 నుంచి పెంచిన డీఏ(DA)ను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్భణం 4 శాతం తగ్గించిన తర్వాత ఏడో పే కమిషన్ సిఫారసుల మేరకు ప్రభుత్వం కరువు భత్యాన్ని కూడా పెంచనుంది.
డీఏ(DA)ను చివరిసారిగా నాలుగు శాతాన్ని కేంద్రం సవరించింది. జనవరి 1, 2023 నుంచి ఈ వేతన సవరణ అమల్లోకి వచ్చింది. నాలుగు శాతం పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42 శాతానికి పెంచింది. దానికి ముందు డీఏ సెప్టెంబర్ 2022లో 4 శాతాన్ని కేంద్రం పెంచింది. ఇది జూలై 2022 నుంచి అమలులోకి రాగా తాజా పెంపు కూడా జూలై 2023 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు(Government Employees), 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.