టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) నిన్న సమావేశం అయ్యారు. ఇప్పటికే చంద్రబాబును కలిసిన పవన్..ఇప్పుడు మరోసారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ఈ భేటీలో చర్చించారని తెలిసింది.
అయితే వీరి భేటీపై తాజాగా జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(nadendla manohar) రియాక్ట్ అయ్యారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల గురించి చర్చించినట్లు తెలిపారు. మరోవైపు ఈ అంశంపై మరికొన్నిసార్లు చంద్రబాబుతో భేటీ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. వైసీపీ లేని ఏపీ కోసం జనసేన పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకతాటిపైకి రావాలని ఆయన అన్నారు. మరోవైపు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పై ప్రజల్లో నమ్మకం తగ్గిందని మనోహర్ తెలిపారు. ఏపీలో జగన్ ఎక్కడ ఉంటే అక్కడే పాలన అన్నట్లుగా తయారైందని నాదేండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలో భూ మాఫియా సహా అనేక ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుందని వెల్లడించారు.