magunta srinivasula reddy:రాఘవ ఏ తప్పు చేయలేదు: శ్రీనివాసుల రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు తీహర్ జైలులో ఉన్నారు. ఈ అంశంపై శ్రీనివాసుల రెడ్డి స్పందించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదన్నారు.
magunta srinivasula reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasula reddy) కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని (raghava reddy) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు తీహర్ జైలులో (tihar jail) ఉన్నారు. ఈ అంశంపై శ్రీనివాసుల రెడ్డి (srinivasula reddy) స్పందించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి (raghava reddy) ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఒంగోలులో (ongole) తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన తండ్రి 70 ఏళ్ల క్రితం వ్యాపారం ప్రారంభించారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యాపారాలు పది రాష్ట్రాల్లో చేస్తున్నామని పేర్కొన్నారు. తనకు ఈ వ్యాపారంలో 50 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు. తమ కుటుంబం ఏ రాష్ట్రంలో కూడా తప్పు చేయలేదని తేల్చిచెప్పారు.
‘రాఘవరెడ్డిని (raghava reddy) కోర్టులో కలిసిన సమయంలో.. పెదనాన్న సుబ్బరామిరెడ్డి గారి పేరు ఎప్పుడూ అప్రతిష్టపాలు చేయను. మీకు తలవంపులు వచ్చే పని కూడా చేయనని తనతో అన్నాడని తెలిపారు. నా కుమారుడు మీద నమ్మకం ఉంది. రాఘవరెడ్డి ఎక్కడా తప్పు చేయలేదు. అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. దయచేసి మీరు ధైర్యంగా ఉండాలని గట్టిగా చెబుతున్నానని తెలిపారు. భగవంతుడా ఇలాంటి బిడ్డను నాకు ప్రసాదించినందుకు జన్మ జన్మలకి రుణపడి ఉండాలని గర్వంగా ఉంటుందని’ శ్రీనివాసుల రెడ్డి అన్నారు. రాజకీయాలలోకి వచ్చి 32 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. సుబ్బారామరెడ్డి రాజకీయ జీవితం ప్రసాదించిన తర్వాత.. ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం ఇది అని.. మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, ప్రకాశం జిల్లా ప్రజలందరికి తమ గురించి తెలుసు అన్నారు. ఈ సమస్యలు తీరిపోయేలా భగవంతుడ్ని ప్రార్ధించాలని జిల్లా ప్రజలను ఆయన కోరారు.
సౌత్ గ్రూప్‌లో మాగుంట (magunta), కవిత (kavitha) కీ రోల్ పోషించారని ఈడీ అధికారులు సమాచారం సేకరించారు. ఆ మేరకు అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్ ఖాతాకు రూ.100 కోట్లు (100 crores) వెళ్లాయని.. అవీ ఆప్ నేతలకు అందజేశారని ఆరోపణలు వచ్చాయి. అందులో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్యే కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉన్నారని తెలిసింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా (amith arora) రిమాండ్ రిపోర్ట్‌లో సౌత్ గ్రూపునకు చెందిన సమాచారాన్ని ఈడీ తెలియజేసింది.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత (kavitha) మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీ రోల్ పోషించాడట. హైదరాబాద్‌కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్స్‌లకు.. ప్రయోజనం పొందిన వారికి అక్రమంగా లాభాలు సమకూరాయని సీబీఐ అంటోంది. కవిత (kavtiha) తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసినప్పటి నుంచి బుచ్చిబాబు అడిటర్‌గా ఉన్నారు. మంత్రి కేటీఆర్, సన్నిహిత నేతలకు కూడా అడిటర్‌గా పనిచేశారని తెలిసింది. అంతకుముందు అభిషేక్ బోయినపల్లిని (abhishek) కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన వ్యాపారి గౌతమ్ మల్హొత్రాను ఈడీ అరస్ట్ చేసింది.