Viral News : ఎవరైనా సాధారణ మహిళలకు బాధ కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం కోసం కోర్టుకు వెళతారు. కోర్టులో న్యాయమూర్తి వారికి తీర్పు ఇస్తారు. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తికే సమస్య వస్తే... రాజస్థాన్ లో ఇదే జరిగింది. ఓ మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎవరైనా సాధారణ మహిళలకు బాధ కలిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం కోసం కోర్టుకు వెళతారు. కోర్టులో న్యాయమూర్తి వారికి తీర్పు ఇస్తారు. అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తికే సమస్య వస్తే… రాజస్థాన్ లో ఇదే జరిగింది. ఓ మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…
రాజస్థాన్ కి చెందిన ఓ మహిళా జడ్జికి సంబంధించిన ఫోటోలను ఓ వ్యక్తి సోషల్ మీడియా నుంచి డౌన్ లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. అనంతరం వాటిని కోర్టులోని ఆమె ఛాంబర్‌తో పాటు ఆమె నివాసానికి కూడా పంపాడు దుండగుడు. మహిళా జడ్జి ఫోటోలను మార్ఫింగ్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు.
మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత మహిళా జడ్జీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళా న్యాయమూర్తిని బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.