కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు చర్చనీయాంశంగా మారిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లక్షద్వీప్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) పైన గతంలో వేసిన అనర్హత వేటును లోకసభ సచివాలయం ఎత్తివేసింది. ఆయన పైన అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వేటు విషయం పైన సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రావడం గమనార్హం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు (Rahul Gandhi disqualification) చర్చనీయాంశంగా మారిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లక్షద్వీప్ కు (Lakshadweep MP) చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party Leader) నేత మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) పైన గతంలో వేసిన అనర్హత వేటును లోకసభ సచివాలయం (lok sabha secretariat) ఎత్తివేసింది. ఆయన పైన అనర్హత వేటును ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు బుధవారం (Lakshadweep MP Mohammed Faizal’s Lok Sabha membership restored) నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వేటు విషయం పైన సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రావడం గమనార్హం.
2009లో కాంగ్రెస్ నేత మహమ్మద్ సలీహ్ పైన దాడి చేశారనే కేసులో 2023 జనవరి 10వ తేదీన లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్ ను కవరత్తి సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి, పదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. తీర్పు వెలువడిన తర్వాత జనవరి 13న లోకసభ సచివాలయం ఆయన పైన అనర్హత వేటు వేస్తూ ప్రకటనను జారీ చేసింది. పైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశించింది. దీంతో ఆయన పైన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ ఫైజల్ సభ్యత్వాన్ని లోకసభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీనిని ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరపనుంది. ఇంతలో లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. అయితే ఫైజల్ కోర్టుకు వెళ్లి అనర్హత వేటు పడకుండా చూసుకున్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తన పైన వేసిన అనర్హత వేటును కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే చట్టం ప్రకారం వెంటనే చట్టసభ్యుడి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. గతంలో లాలూ ప్రసాద్ విషయంలో, నిన్న లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ విషయంలో అదే జరిగింది. అంతకుముందు జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ రాహుల్ గాంధీ విషయంలో మాత్రం ఆయన చట్టానికి అతీతుడు అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరించి, రాద్దాంతం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఫైజల్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆయన కోర్టు మెట్లు ఎక్కవచ్చునని భావిస్తున్నారు.