కర్ణాటకలో (karnataka) ఓ రైతు (farmer) ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister of India) చిత్రాన్ని ముద్దు పెట్టుకుంటున్న వీడియో (Video) నెట్టింట వైరల్ అయింది. కర్నాటక రోడ్ ట్రాన్సుపోర్టుకు (karnataka road transport bus) చెందిన బస్సు పైన ప్రధాని మోడీ చిత్రంతో (PM Modi Pic) కేంద్ర ప్రభుత్వానికి (Central Government) సంబంధించిన ఓ ప్రకటన ఉంది. దీనిని చూసిన ఓ రైతు (Farmer) ఆ ఫోటోను ముద్దు పెట్టుకుంటూ… ‘ఇంతకుముందు నాకు రూ.1,000 వచ్చేది, ఇంకా రూ.500 ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. మా ఆరోగ్యం కోసం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పావు. నేను మీ పాదాలకు నమస్కరిస్తాను.. మీరు ప్రపంచాన్ని గెలుస్తారు’ అంటూ రైతు ముద్దుపెడుతున్నట్లుగా ఉంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీసి, షేర్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను మోహన్ దాస్ కామత్ వ్యక్తి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు 400కు పైగా లైకులు, వందల కొద్ది షేర్లు అయ్యాయి.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. 224 సీట్లు ఉన్న కన్నడ నాట మే 10వ తేదీన పోలింగ్, మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన చర్యలతో పాటు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్నాటకకు ఏం చేసిందో చెప్పడానికి బీజేపీ స్థానిక నేతలు సిద్ధమయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే మరింత అభివృద్ధి అని బీజేపీ మొదటి నుండి చెబుతోంది. ప్రస్తుతం బీజేపీకి కర్నాటకలో 119 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లు, జేడీఎస్ కు 28 సీట్లు ఉన్నాయి. ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఏ ప్రభుత్వం కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే అది రికార్డ్ అవుతుంది.