Janhvi Kapoor: వావ్ అనిపిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. బాలీవుడ్ తోపాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది.
ఈ క్రమంలో పలు సందర్భాలలో తన ఇన్ స్టా ఖాతాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది.
తాజాగా లండన్లో ఛారిటీ ఫండ్ రైజర్లలో ఒకటైన యానిమల్ బాల్ కార్యక్రమానికి ఈ అమ్మడు హాజరయ్యారు.
జాన్వీ కపూర్ తన డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి యానిమల్ బాల్ 2023లో పాల్గొన్నారు.
ఆ క్రమంలో జాన్వీ ధరించిన డ్రైస్ చూపరులను ఆకట్టుకుంటుంది
ఈ కార్యక్రమం వన్యప్రాణుల సంరక్షణ కోసం అవగాహన, నిధుల సేకరణ కోసం ప్రతి ఏటా నిర్వహిస్తారు.
సింహం మేన్ను పోలి ఉండే ఈకలతో రూపొందించబడిన డ్రైస్ వావ్ అనేలా ఉంది. బంగారు వర్ణంలో ఉన్న పొడవు గౌనులో సైడ్-బేరింగ్ కటౌట్లతో జాన్వీ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
ఆ డ్రెస్లో జాన్వీ కపూర్ గంభీరంగా అడవి రాణి మాదిరిగా ఆకర్షణీయంగా కనిపించింది.