»Indecent Behavior Of Bride With Future Wife In Pre Wedding Party At Hyderabad Annulment Of Marriage
Pre Wedding Party:లో కాబోయే భార్యతో అసభ్య ప్రవర్తన..పెళ్లి రద్దు
వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో వరుడు(bride) వైష్ణవ్ పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇటీవల కాలంలో అనేక పెళ్లిల్లు(marriages) చివరివరకు వచ్చి లాస్ట్ మినిట్‌లో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో వరుడు సరిగా పూల మాల వేయలేదని ఒకరు. ఇంకొకరైతే ఫొటోకు మంచిగా స్టిల్ ఇవ్వలేదని మ్యారేజీ ఆగిపోయింది. మరోచోట మహిళకు ఎదురు కట్నం ఇవ్వాలని, ఇంకో దగ్గర కట్నం పెళ్లి సమయానికి ఇవ్వలేదని ఆగిన పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోనే చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన వైష్ణవ్ (28)కి హైదరాబాద్(hyderabad)కు చెందిన 24 ఏళ్ల యువతితో మొయినాబాద్‌లోని రిసార్ట్‌లో నిశ్చితార్థం జరిగింది. అయితే వివాహానికి ముందు జరిగిన పార్టీలో వైష్ణవ్ కొంతమంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. అది గమనించిన అతని కాబోయే భార్య అతనిని ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. అయినా కూడా అతను తగ్గకపోగా పెళ్లి కుమార్తెపైనే దాడికి ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో అబ్బాయి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయి ఫ్యామిలీ పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లికి ముందే అబ్బాయి ప్రవర్తన ఇలా ఉంటే..ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందోనని భయాందోళన చెంది మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు.
ఆ క్రమంలో అప్పటికే అబ్బాయి కుటుంబానికి ఇచ్చిన 3 కోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వరుడి(bride) కుటుంబీకులు రెండు రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించి తమ స్వస్థలమైన చిత్తూరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వైష్ణవ్ తెలియని ఫోన్ నంబర్లతో అమ్మాయికి కాల్ చేయడం ప్రారంభించాడు. ఆమె మరొకరిని వివాహం చేసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. దీంతో బాధిత అమ్మాయి కుటుంబం వైష్ణవ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వైష్ణవ్, అతని కుటుంబంపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.