»Heavy Rains In Himachal Pradesh And Haryana Red Alert Issued Imd
Heavy rains: హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ
దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(IMD) పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు రాబోయే రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కురుస్తున్న క్రమంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడేఅవకాశం ఉందని ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు లాహౌల్, స్పితి జిల్లాలకు వాతావరణ అంచనా శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చంబా, కాంగ్రా, కులు, మండి, ఉనా, హమీర్పూర్, బిలాస్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.
దీంతోపాటు పంజాబ్(punjab), హర్యానా(Haryana), చండీగఢ్‌లలో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని, సమయానికి ముందే పంజాబ్, హర్యానాకు వచ్చాయని వాతావరణ శాఖ అధికారి అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ క్రమంలో హర్యానాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. యమునానగర్‌లో అత్యధికంగా 83.5 మిమీ వర్షపాతం నమోదైంది. అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కర్నాల్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
చండీగఢ్ వాతావరణ శాఖ 11 నగరాల్లో రాబోయే 3 గంటలపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన ఆ శాఖ నగరాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంద్రి, రాదౌర్, తానేసర్, షహాబాద్, అంబాలా, కల్కా, బరాడా, జగధర్, ఛచ్రౌలి, నారాయణగర్, పంచకుల నగరాల్లో ఆరెంజ్ హెచ్చరికలు ఉన్నాయి. వాతావరణ శాఖ తరపున, హిసార్, ఫతేహాబాద్, తోహానా, రాటియా, జగధర్, ఛచ్చరౌలీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నగరాల్లో డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.