తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

నిన్న ఈడీ(ED) విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. 9 గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కూతురి గురించి ఆలోచించిన శోభ(Shobha) స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేటీఆర్(KTR) కూడా తన తల్లిని చూసేందుకు ఆస్పత్రికి చేరుకోనున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.