Viral News: బస్ టికెట్ ధర రూ.29 వేలు..షాకైన ప్రయాణికులు
హైదరాబాద్(Hederabad) సీటీ బస్సు(City Buss)లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు టికెట్టు ధర(Ticket Cost) చూసి అవాక్కయ్యాడు. ఓ బస్సు కండక్టర్ రూ. 29,210 టికెట్టు ఇవ్వడంతో ప్రయాణికుడు కంగారు పడ్డాడు. ఇదేంటని అడిగితే అసలు విషయం బయటపడింది.
Viral News: సాధారణంగా హైదరాబాద్ సిటీలో బస్సు ఎక్కితే టిక్కెట్ ధర రూ.20 నుంచి గరిష్టంగా 80 వంద రూపాయల వరకు ఉంటుంది. సామాన్య ప్రయాణికులు బస్సులు ఎక్కేదే తక్కువ డబ్బులతో ప్రయాణం చేయోచ్చని అనుకుంటారు. కానీ ఇటివల ఓ బస్సు ఎక్కిన ప్రయాణికుడికి కండక్టర్ ఇచ్చిన టిక్కెట్ చూసి అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే అతనికి కండక్టర్ ఏకంగా 29,210 రూపాయల టిక్కెట్ ఇచ్చాడు. అది చూసిన ప్రయాణికుడు అవాక్కాయ్యాడు. అదేంటని ప్రశ్నించాడు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
గురువారం సాయంత్రం ఓ వ్యక్తి ఇస్నాపూర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న బస్సు ఎక్కాడు. బాలానగర్ చౌరస్తాకు టిక్కెట్ కావాలని కండెక్టర్(Conductor)ను అడిగాడు. రాణిగంజ్ డిపో బస్సు కండక్టరు ఒక టికెట్టు ఇచ్చాడు. రూ.20, 25 రూపాయలో ఇస్తాడని అనుకుంటే ఏకంగా రూ.29,210 టిక్కెట్ ఇచ్చాడు. టికెట్టును చేతిలో పట్టుకొని ఆశ్యర్యపోయిన ప్రయాణికుడు ఇదేంటని కండక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అది చూసి మిషన్ లో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తి ఉంటుందని చెప్పి మరోటిచ్చాడు. తరువాత ఈ ఇష్యూ తమ దృష్టికి రావడంతో సాంకేతిక లోపాన్ని సవరించామని రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ తెలిపారు. దీంతో వివాదం కాస్తా సద్దుమణిగింది. చుశారా సాఫ్ట్ వేర్ కూడా ఎల్లప్పుడూ కరెక్టుగా పనిచేయదనేది తెలుసుకోవాలి. పూర్తిగా వాటిపైనే ప్రజలు ఆధారపడి గుడ్డిగా నమ్మోద్దు. గతంలో డీ మార్ట్ బిల్లుల విషయంలో సైతం గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రజలు వారికి వచ్చిన బిల్లులను ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి.