ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది. దాదాపు పది గంటలుగా ఆమె విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కవిత (ed enquiry). ఈడీ కార్యాలయంలోని (ED Office) మూడో ఫ్లోర్ లో ఆమెను (kavitha latest news) విచారించారు. సాయంత్రం ఓ వైపు కవిత విచారణ జరుగుతుండగానే ఆమె అడ్వోకేట్ కు కబురు పంపింది ఈడీ. దీంతో సోమా భరత్ నేతృత్వంలోని కవిత లీగల్ టీమ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నది. ఈడీ అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందించింది. ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, 144 సెక్షన్ విధించడం వంటి అంశాలు అరెస్టుకు సూచికగా కనిపించాయి. కానీ సుదీర్ఘ విచారణ సాగింది. ఈ నెల 11వ తేదీన కవితను తొలుత విచారించిన ఈడీ, సోమ, మంగళవారం వరుసగా రెండు రోజుల పాటు విచారించింది.
సోమా భరత్ నేతృత్వంలోని కవిత లీగల్ టీమ్ ను ఆథరైజేషన్ కోసం పిలిపించినట్లుగా తెలుస్తోంది. తదుపరి నోటీసులకు కవితకు బదులు సోమా భరత్ హాజరు అవుతారా అనే చర్చ సాగుతోంది. అయితే అదేం లేదని, ఆమెకు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో అన్ని విషయాలు ఆమెకు తెలుసు కాబట్టి ఆమె హాజరు కావాల్సిందే అంటున్నారు. కానీ ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమైన సమయంలో కవిత ప్రతినిధిగా సోమా భరత్ కోరిన డాక్యుమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఆద్యంతం ఉత్కంఠ
కవిత ఈడీ కార్యాలయంలోకి మద్యాహ్నం పదకొండున్నర గంటలకు వెళ్లారు. సాయంత్రం తర్వాత అరెస్టు పైన ఊహాగానాలు వచ్చాయి. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్, భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరున్నర, ఏడు గంటలకు కవిత లీగల్ టీమ్ పిలిపించి, పలు డాక్యుమెంట్లు తీసుకున్నది ఈడీ. సోమా భరత్ నేతృత్వంలోని కవిత లీగల్ టీమ్ ఈడీ అడిగిన వివిధ డాక్యుమెంట్లు అందించారు. సాయంత్రం ఏడు గంటల నుండి లీగల్ టీమ్ ఈడీ కార్యాలయం వద్దనే ఉన్నది. ఆ తర్వాత ఎస్కార్ట్ వాహనం ఈడీ కార్యాలయానికి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో కేసీఆర్ నివాసం నుండి కేంద్ర బలగాలను వెనక్కి తిరిగాయి. కవిత విచారణ రాత్రి తొమ్మిదిన్నర.. పది గంటల వరకు సాగవచ్చునని అంటున్నారు. నిన్న ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి 9.10 నిమిషాల వరకు విచారణ సాగింది.