AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద లారీని కారు ఢీకొట్టింది. దీంతో టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్ టెంపుల్కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.