హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసి భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 208 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 145 బంతుల్లోనే గిల్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. మొత్తం19 ఫోర్లు, 9 సిక్స్‌లతో గిల్ షాట్ల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ 31, పాండ్య 28 పరుగులు చేశారు. దీంతో కివీస్ ముందు భారీ టార్గెట్ నిలిచింది.