DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏపీ సర్కారు తీపి కబురు
ఏపీలోని ఉద్యోగులకు డీఏ(DA RElease) మంజూరు చేస్తూ జీవో నెం.66, పెన్షనర్ల(Pensionars)కు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67ను తీసుకొస్తున్నట్లు సర్కార్ తెలిపింది.
ఏపీలోని ఉద్యోగులు(Ap Employees), పెన్షనర్ల(Pensionars)కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2022 జనవరి 1వ తేది నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి డీఏ బకాయిలను(Pending DA) మంజూరు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఈ విషయంలో అధికారికంగా ఏపీ సర్కార్(AP Government) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు జీవో(GO’s)లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) ప్రకటన విడుదల చేసింది. ఏపీలోని ఉద్యోగులకు డీఏ(DA RElease) మంజూరు చేస్తూ జీవో నెం.66, పెన్షనర్ల(Pensionars)కు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ డీఏను ఈ ఏడాది జులై 1వ తేది నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని సమాచారం. కాగా, తాజా డీఏ(DA)తో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగనుంది.