A video of a man bathing a snake cobras has gone viral
Viral news: మాములుగా పెంపుడు జంతులైన కుక్కలు(Dogs), పిల్లల(Cats)కు స్నానాలు చేయిస్తారు. కానీ ఒక వ్యక్తి ఏకంగా పాముకే(Snake) స్నానం చేయిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది భయపడుతున్నారు కూడా. అయితే అతను ఒక మగ్‌తో పడగ విప్పున రెండు నాగుపాముల(Cobra) తలలపై నీళ్లు పోస్తున్నాడు. అవి కూడా చక్కగా నిలబడి స్నానం చేస్తున్నాయి.
జంతు రక్షకుడు, ప్రేమికుడు సింటూ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో చూడటానికి ఆసక్తిగా ఉంది. మూడు రోజుల క్రితం వీడియో పోస్ట్ చేయగా దీనికి దాదాపు 24,000 వ్యూస్ తోపాటు విపరీతమైన షేర్స్, 1,300 లైక్‌లు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే విధంగా కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి ఖాళీ చేతితో నాగుపామును పట్టుకున్న వీడియో కూడా వైరల్ అయి ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. అదే విధంగా పామును ఎలా మచ్చిక చేసుకోవాలో, దాన్ని ఎలా పట్టుకోవాలో కూడా అతడు వివరించాడు.