Shamshabad: పూజారితో వివాహేతర సంబంధం..చివరికి అతని చేతిలోనే
సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.
హైదరాబాద్ శంషాబాద్లో(shamshabad) దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అఖరికి అదే ఆమె ప్రాణాలు కోల్పోయే స్థితికి దారి తీసింది. ఆమెను శారీరకంగా వాడుకున్న పూజారిని ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా..అతను కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగలేదు. చంపేసిన తర్వాత మహిళ మృతదేహన్ని మ్యాన్ హోల్ లో దాచిపెట్టాడు. ఇక వివరాల్లోకి వెళితే.. అప్సర అనే మహిళను బస్సు ఎక్కిస్తానని చెప్పి కారులో శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి వద్దకు పూజారి సాయి కృష్ణ తీసుకెళ్లాడు. ఆ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని వివాహిత సాయికృష్ణతో గొడవకు దిగింది. దీంతో పెళ్లి చేసుకొనేందుకు సాయికృష్ణ అంగీకరించలేదు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. ఆ నేపథ్యంలో సాయికృష్ణ కోపంతో అప్సర తలపై బండారియతో కొట్టి హత్య చేశాడు. అప్సర మృతదేహన్ని కారులో తీసుకొచ్చి సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న మ్యాన్ హల్ లో దాచిపెట్టాడు.
ఆ తర్వాత అప్సర కన్పించడం లేదని సాయికృష్ణ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు(police) విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సాయికృష్ణ, అప్సరలు కలిసే ఉన్నారని మొబైల్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా.. సుల్తాన్ పల్లి వద్ద కారులో అప్సర, సాయికృష్ణ తిరిగినట్టుగా దృశ్యాలు కన్పించాయి. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అప్సరను హత్య చేసినట్లు సాయిక్రిష్ణ ఒప్పుకున్నాడు.
సుల్తాన్ పల్లి వద్ద అప్సర(apsara)ను హత్య చేసిన స్థలాన్ని కూడా సాయికృష్ణ(saikrishna)పోలీసులకు చూపించాడు. మరో వైపు సరూర్ నగర్ లో అప్సర డెడ్ బాడీని దాచిపెట్టిన మ్యాన్ హోల్ నుంచి వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అప్సరకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండటం విశేషం. సాయికృష్ణకు కూడ పెళ్లైంది. సాయికృష్ణ, అప్సర మధ్య బంధుత్వం కూడా ఉందని తెలుస్తుంది. సాయికృష్ణ పూజారిగా పనిచేస్తున్నాడు.