W.G: గత నెల 9 న పాలకొల్లు సూర్య తేజస్సు నగర్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కె. రజనీ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. వారి వద్ద నుంచి లక్ష విలువ చేసే బంగారు వస్తువులు రికవరీ చేసినట్టు చెప్పారు. గత నెల దొంగతనంలో ఒక ఇంట్లో రూ.2 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులు, మరో ఇంట్లో వెండి వస్తువులు దొంగిలించారని తెలిపారు.