ఏలూరు పరిధిలోని వంగాయగూడెంలో సోమవారం ప్రమాదం జరిగింది. స్కూటీని బైక్ ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైక్ మీద వచ్చిన ముగ్గురు యువకులు పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఏలూరు ఒన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు తీసుకెళ్లినట్లు తెలిపారు.