పోలీస్ స్టేషన్ నుంచే ట్రక్కు మాయమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లా జాస్పుర పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఇసుక ఓవర్ లోడింగ్ ఆరోపణలపై పోలీసులు ట్రక్కును సీజ్ చేశారు. అధికారులు ఆ ట్రక్కును జాస్పుర ఠాణా ప్రాంగణంలో ఉంచారు. అయితే ఆ ట్రక్కు అర్ధరాత్రి వేళ కనిపించకుండా పోయింది. కాగా, పోలీసులు చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.