TG: కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో జరిగింది. ఆదర్శపాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని హాస్టల్‌కు వచ్చేముందు ఇంట్లో వాళ్లతో గొడవ జరిగింది. దీంతో కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని హాస్టల్‌కు తెచ్చింది. అది చూసిన మరో విద్యార్థిని దాన్ని తాగింది. దీంతో సదరు విద్యర్థనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.