ELR: ఏలూరులోని పవర్పేట రైల్వే స్టేషన్ 2వ నంబర్ ప్లాట్ఫారం మీద కాలుజారి పడి ఓ వృద్ధుడు మృతి చెందాడని ఎస్సై సైమన్ తెలిపారు. ఎస్సై వివరాలు.. దక్షిణపు వీధికి చెందిన రాజనాల రాము (73) అనే వృద్ధుడు విజయవాడ వెళ్లుటకు శనివారం పవర్పేట రైల్వే స్టేషన్కు వచ్చాడన్నారు. ఈ నేపథ్యంలోనే ప్లాట్ఫారం పై ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడని చెప్పారు.