సూర్యాపేట: మహుబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహన్ పురం గ్రామానికి చెందిన ఆబోతు ప్రశాంత్(30) సోమవారం రాత్రి పల్సర్ బైక్ పై అత్తగారింటికి వెళుతుండగా మద్దిరాల మండల కేంద్ర శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.