KDP: ఓ ఇంటర్ అమ్మాయి కాలిన గాయాలతో అడవిలో కేకలు వేయడం కలకలం రేపింది. బద్వేల్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి గోపవరం మండలం పీపీకుంట వద్ద ఉన్న ఓ పరిశ్రమ సమీపంలోని అటవీ ప్రాంతంలో కేకలు వేయడంతో స్థానికులు గుర్తించారు. ఒంటిపై తీవ్రంగా కాలిన గాయాలు ఉండటంతో స్థానికుల సహాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.