కృష్ణా: అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గుడివాడను అత్యుత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే రాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. రూ.37.40 లక్షల నిధులతో గుడివాడ బేతవోలులోని ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి పనులకు కూటమి నేతలతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.