CTR: పెనుమూరులోని బస్టాండ్ వద్ద శనివారం ‘పల్లె పండుగ’ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. వాటితో పాటు చిప్పరపల్లి పంచాయతీలోని పాళ్యం యానాది కాలనీలో కొత్తగా చేపట్టబోయే రోడ్డు పనులను మండల టీడీపీ అధ్యక్షుడు పి.రుద్రయ్య నాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.