కోనసీమ: పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సత్యానందరావు అన్నారు. గురువారం కొత్తపేట మండలం వాడపాలెంలో సీఎం సహాయ నిధి నుండి వైద్యం రీఎంబర్స్మెంట్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్న ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతికి 40 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు.