కృష్ణా: టీడీపీ కేంద్రం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని రైల్వే అధికారులు చాటింపు వేయించారని, తమఇళ్లు కూల్చివేసి ఖాళీ చేయిస్తారని బాధితులు అందోళన పడుతున్నారన్నారు.