NDL: జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులలో 50 శాతం రాయితీ ఇవ్వాలని సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోకన్వీనర్ కాకర్ల శివ కలెక్టర్ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ కార్యదర్శి గిరిబాబు పాల్గొన్నారు.