సత్యసాయి: జిల్లా ఎస్పీ శ్రీమతి వీ. రత్న ఐపీఎస్ గారి ఆదేశాలతో, ఈరోజు సాయంత్రం నుండి జిల్లా వ్యాప్తంగా SHOలు, CIలు వాహనాలు తనిఖీ చేపట్టారు. అక్రమ రవాణా, గంజాయి, మద్యం నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వేగం నియంత్రించుకోవాలని సూచించారు.