కృష్ణా: బాపులపాడు మండలం ఆరుగొలనులో 2018 జనవరి 20వ తేదీన బొలెరో వాహనం వేగంగా నడుపుతూ బైక్ను ఢీకొనడంతో పెదపాడు మండలానికి చెందిన ఒక వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్ తోట కనకారావుకు మూడు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు.