NLR: వింజమూరులోని పలు ప్రాంతాలు వర్షం తాకిడికి అతలాకుతలమయ్యాయి. చాలా ఇల్లు వర్షం నీటిలో మునిగిపోయాయి. మూగజీవాల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. స్థానిక నాయకులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు వర్షపు నీటిలో అవస్థలకు గురవుతున్నారు. ఇంత వర్షం కేవలం రెండు గంటల వ్యవధిలోనే పడింది.