విజయనగరం: జిల్లాకు చెందిన అమ్మ సేవా ఫౌండేషన్, సహాయస్ఫూర్తి ఫౌండేషన్, అభ్యుదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెం మరియు విజయవాడ వరద బాధితులకు ఆదివారం సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరద బాధితులకు అవసరమైన మెడికల్ సదుపాయం నిత్యవసర వస్తువులు దుప్పట్లు విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించడం జరిగింది.