GNTR: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను కస్టడీకి ఇవ్వాలని గుంటూరు అరండల్ పేట సీఐ శ్రీనివాసరావు 5వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పిటీషన్ దాఖలు చేశారు. గుంటూరులోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి కోశాధికారి కర్లపూడి బాబూప్రకాష్ను రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని అనిల్ కుమార్ బెదిరించాడు. ఈ కేసులో పోలీసులు బోరుగడ్డను అరెస్ట్ చేశారు.