BPT: రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. వేమూరు, చుండూరు సర్కిళ్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన రౌడీషీటర్లకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగి జీవించాలన్నారు. కార్యక్రమంలో వేమూరు, చుండూరు సీఐలు పాల్గొన్నారు.