KDP: కడప నగరంలోని స్థానిక నబీకోటలో బుధవారం ఎమ్మెల్యే మాధవి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ షాపును ఎమ్మెల్యే మాధవి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.