ASR: రంపచోడవరం సబ్ డివిజన్ డీఎస్పీగా జి.సాయిప్రశాంత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏపీపీఎస్సీ బ్యాచ్ చెందిన సాయి ప్రశాంత్ గ్రేహౌండ్స్‌లో పనిచేసే రంపచోడవరం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. రంపచోడవరం డివిజన్ చెందిన సీఐలు, ఎస్సైలు ఆయన్ని గౌరవపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణాలను అరికట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.