VSP: ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రీ టౌన్ ఎస్సై శ్రీనివాసరావు కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల చట్టపరమైన చర్యలకు బాధ్యులుగా నిలవాల్సి వస్తుందని చెప్పారు. ఇటువంటి పదార్థాలను వినియోగించడం, కలిగి ఉండడం, రవాణా చేయడం నేరమని తెలిపారు.