KDP: మైదుకూరులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ నమోదు ప్రక్రియ ప్రారంభమైనది. సభ్యత్వం తీసుకున్న ప్రతి వారికి 2 సంవత్సరాల కాల పరిమితిలో ఐదు లక్షల బీమా పార్టీ ద్వారా వస్తుందన్నారు.