కృష్ణా: పమిడిముక్కల మండలం మేడూరు మాజీ సర్పంచ్ యలమంచి సాయి కృష్ణ ఇంట్లో గురువారం దుండగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఊరు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న 10కేజీల వెండి, 7 సవర్ల బంగారం అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.