చిత్తూరు: మహిళలు ఆర్థిక స్వాలంబన సాగించే దిశగా అడుగులు వేయాలని శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మహిళా సంఘ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం, విక్రయించే అవకాశం కలిగిందన్నారు.