VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల నమోదుల పై విస్తృతంగా చర్చించారు. సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా నూతన కార్యాచరణను రూపొందించినట్టు మంత్రికి వివరించారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.