NLR: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని వేమారెడ్డి నగర్లో చోటుచేసుకుంది. రాగాల యాచేంద్ర, తేజస్వికి వీరిద్దరికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. వివాహమై రెండేళ్లు కావస్తున్న సంతానం లేకపోవడంతో యాచేంద్ర ఆమెను నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులకు తట్టుకోలేక తేజస్వికి ఆత్మహత్య చేసుకుంది.