కృష్ణా: హంసలదీవి బీచ్ వద్ద పరిసరాలను పాలకాయ తిప్ప మెరైన్ పోలీస్ సిబ్బంది పరిశుభ్రపరిచారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా మెరైన్ సీఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీచ్ పరిసర ప్రాంతాల్లోని వ్యర్ధాలను ఏరి, నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.