కృష్ణా: ఆగిరిపల్లిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులకు నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ మంగళవారం రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు. అందుకు కొన్ని ప్రదేశాలు కేటాయించటం జరిగిందని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.