కడప: సిద్ధవటం మండలం వంతాటి పల్లె గ్రామ సచివాలయంలో మంగళవారం కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మండల ప్రత్యేక అధికారి జయసింహ మాట్లాడుతూ.. గ్రామంలోని గృహాల వద్దకు వెళ్లి ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నామని తెలిపారు.